విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున 14,15 తేదిన ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఈపీడీసీఎల్ నరసాపురం ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పోడూరు మండలాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహాకరించాలని కోరారు.