నరసాపురం మండలం ఎల్బీచర్ల గ్రామపంచాయతీ సారవ గ్రామంలో ఉన్న గంగమ్మ తల్లిని ఆదివారం భక్తులు ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. కొంత మంది మొక్కుబడులు చెల్లించుకొని, ఆలయ ఆవరణలో అన్నప్రసాదాలు నిర్వహించారు.