నర్సాపురం-తిరువన్నమలై (అరుణాచలం)కి ప్రతి బుధవారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ గణపతి మధుబాబు శనివారం తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపురం నుంచి 07219 నంబర్ ప్రత్యేక రైలు బయలుదేరి తిరుపతి మీదుగా గురువారం ఉదయం 4:55 గంటలకు తిరువన్నమలై చేరుకుంటుంది. తిరిగి గురువారం ఉదయం 11 గంటలకు 07220 నంబర్ రైలు తిరువన్నమలైలో బయలుదేరి శుక్రవారం ఉదయం రెండు గంటలకు నర్సాపురం చేరుకుంటుందని అన్నారు.