నరసాపురం పట్టణంలోని ప్రధమ శ్రేణి శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన తరగతులలో భాగంగా బుధవారం విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. గ్రేడ్ 1 లైబ్రరీయన్ కుమారి పర్యవేక్షణలో ఎన్సైక్లోపీడియాస్ విజ్ఞాన సర్వస్వాలు, కథల పుస్తకాలు చదివించడం, యోగాసనలు, మెడిటేషన్, కేరీర్ గైడెన్స్, చిత్ర లేఖనం, స్పోకెన్ ఇంగ్లిష్, గుడ్ హ్యాండ్ రైటింగ్ అంశాల్లో శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.