జులై 9 నుంచి నర్సాపూర్-తిరువణ్ణామలై వీక్లీ స్పెషల్ రైలు ప్రారంభంకానుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ శనివారం తెలిపారు. తిరువణ్ణామలై (అరుణాచలం)కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నర్సాపురం ప్రత్యేక రైలు నడపాలని రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశామన్నారు. సానూకూలంగా స్పందించిన రైల్వే శాఖ వీక్లీ స్పెషల్ రైలు సేవలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారని మంత్రి తెలిపారు.