పగో జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ప్రకృతి ఆశ్రమం ఎదురుగా ఉన్న మామిడి తోటలో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పనుల ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు, సిబ్బందికి ఆటవిడుపు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.