నరసాపురం లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు చర్చనీయాంశమైంది. ఆదివారం పాస్టర్లు చంద్రశేఖర్, నవకుమార్ ప్రార్థన చేసేందుకు పోటీ పడటంతో, వారికి మద్దతుగా రెండు వర్గాలుగా విడిపోయిన సభ్యులు గొడవకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గతంలో ఇదే చర్చిలో పాస్టర్ల నియామకంలో వివాదం తలెత్తడం జరిగింది.