టీ నర్సాపురం మండల పరిషత్ ఆధ్వర్యంలో నర్సాపురంలో యోగాంధ్ర అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఎంపీడీవో జి. నగరాజకుమారి నేతృత్వంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రధాని సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం చేపట్టారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.