ముత్యాలపల్లి ఆలయంలో ఉద్రిక్తత

58చూసినవారు
ముత్యాలపల్లి ఆలయంలో ఉద్రిక్తత
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి శ్రీబండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు. అగమశాస్త్రానికి వ్యతిరేకంగా కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అమ్మవారు మద్రాసు నుంచి రాళ్ళ రూపంలో వచ్చి ఇక్కడ కొలువయ్యారని, పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ప్రక్కన పెట్టి కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్