గత ప్రభుత్వ హయంలో నరసాపురం మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన అధికారులు కానీ కౌన్సిలర్లను కానీ వదిలే ప్రసక్తి లేదని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. శుక్రవారం నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనకు మున్సిపల్ కౌన్సిలర్లు గాని కమిషనర్ చైర్ పర్సన్ సిబ్బంది ప్రోటోకాల్ పాటించలేదంటూ టిడిపి జనసేన కౌన్సిలర్లు అంతకు ముందు ఆందోళన చేశారు.