పెరవలి మండలం ముక్కామలకి చెందిన వ్యక్తికి అత్తిలికి చెందిన మహిళతో 2022లో వివాహమైంది. పెళ్లి కానుకలుగా రూ. 5 లక్షలు, రెండు కాసుల బంగారు ఆభరణాలు ఇచ్చారు. గత కొంతకాలం నుంచి చెడు అలవాట్లు చేసుకొని తాగి వచ్చి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మరో రూ. 3 లక్షలు కావాలని వేధిస్తున్నాడని గురువారం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.