కృష్ణా జిల్లా కృత్తివెన్నులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన కుంపట్ల రాంగోపాల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ భార్య రీతూ హైదరాబాద్ ఆసుపత్రిలో శనివారం మృతి చెందారు. ఆదివారం ఆమె మృతదేహాన్ని పాలకొల్లుకు తరలిస్తున్నారు. భర్త అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే రీతూ మరణవార్త తెలియడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.