పాలకొల్లు పట్టణంలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జ్ వి. సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు జడ్జి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు ఆమెను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.