విద్యుత్ తీగల మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాలకొల్లు పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ సురేష్ కుమార్ తెలిపారు. రామారావుపేట, బీఆర్ఎంవీఎం పాఠశాల, లాక్ డౌన్, పెదసాయిబాబా ఆలయం, వీవర్స్ కాలనీ, హనుమాన్ కాలనీ, లజపతిరాయ్ పేట, నరసాపురం రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.