యలమంచిలి మండలం బూరుగుపల్లి సోసైటీలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను విక్రయించాలంటే అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు. అలాగే ధాన్యం సొమ్ములు సకాలంలో పడలేదని కానీ కూటమి ప్రభుత్వం దాన్యం విక్రయించిన 24 గంటల్లో సొమ్ములు జమ చేస్తుందని తెలిపారు.