రానున్న 4 రోజుల్లో భారి వర్షాలు కురేసే అవకాశం ఉన్నందును వరి రైతులు కోతలను వాయిదా వేసుకోవాలని యలమంచిలి మండల వ్యవసాయాధికారిణి దేవి అన్నారు. యలమంచిలి మండలంలోని మేడపాడు, పెనుమర్రు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పోలంబడి కార్యక్రమంలో రైతులనుద్దేసించి మాట్లాడారు. ఇప్పటి వరకు కోత అయినటువంటి ధాన్యం కళ్ళాల్లో ఉంచకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాలని తెలిపారు.