పాలకొల్లు వైసీపీ ఆఫీస్ నందు మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు ఘనంగ నిర్వహించారు. పాలకొల్లు వైసీపీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆదేశానుసారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత, నియోజకవర్గంలో వున్న వైసీపీ సీనియర్ నాయకులచే కేక్ కట్ చేయించారు. అనంతరం జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులుఅర్పించారు.