ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా చాగంటి మురళీ కృష్ణ (చిన్న ) నియమితులయ్యారు. ఈ సందర్బంగా బుధవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మనోహర్ మురళీ కృష్ణ కు అభినందనలు తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని మంత్రి తనకు సూచించినట్లు మురళీకృష్ణ తెలిపారు.