పాలకొల్లు సర్కిల్ పరిధిలో 143 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని రూరల్ సీఐ జి. శ్రీనివాస్ శుక్రవారం చెప్పారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండల పరిధిలో జూదాలు ఆడే ప్రదేశాలను, కోళ్లకు కత్తులు కట్టే వారిని గుర్తించామని చెప్పారు. ప్రతి ఒక్కరు సంక్రాంతిని కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని సీఐ శ్రీనివాస్ కోరారు.