పాలకొల్లు: మే 19 నుండి దేశాలమ్మ జాతర ఉత్సవాలు

68చూసినవారు
పాలకొల్లు: మే 19 నుండి దేశాలమ్మ జాతర ఉత్సవాలు
పాలకొల్లు పట్టణంలోని లాకుదిగువ కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ దేశాలమ్మ అమ్మవారి 53 వ జాతర మహోత్సవాలు మే నెల 19 నుంచి 25 వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు పాలకొల్లు పరిసర ప్రాంతాల నుండే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి బంధువులు, భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్