పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా ఆదేశించడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో పాలకొల్లు పట్టణం విధ్వంసానికి గురైందని, ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వాటిని గాడిలో పెడుతున్నామన్నారు.