పాలకొల్లు: సంకటహరణ చతుర్థి సందర్భంగా హోమం

54చూసినవారు
పాలకొల్లు: సంకటహరణ చతుర్థి సందర్భంగా హోమం
పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం సంకటహరణ చతుర్థి సందర్బంగా శ్రీ లక్ష్మి గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 15 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, చిట్టూరి గాంధీ అర్చక బృందం, భక్తులు ఆలయ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్