పాలకొల్లు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

76చూసినవారు
పాలకొల్లు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
పాలకొల్లు రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు కుంపట్ల రామ్‌గోపాల్‌ (41) గురువారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. రామ్‌గోపాల్‌ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ వెళ్లి పాలకొల్లు తిరిగి వస్తున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో కారు–లారీ ఢీకొనడంతో రామ్‌గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య కుమారిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కుమారుడు, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్