పాలకొల్లు: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

77చూసినవారు
పాలకొల్లు: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు 14 కోట్లతో దామ్మయ్యపర్తి మైనర్ డ్రైన్ మరమ్మత్తుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం డ్రైన్ తవ్వకం పనులు పరిశీలించారు. అలాగే అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్