పాలకొల్లు నియోజకవర్గంలో చింతపర్రు అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు శ్రమదానం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా మంత్రి పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో స్లాబ్ సెంట్రింగ్ పనుల్లో స్వయంగా పైకి ఎక్కి, చెక్కలు అమర్చి, మేకులు కొట్టారు. స్లాబ్ పనుల్లో ఐరన్ కటింగ్ చేసి భుజంపై ఎత్తుకొని మోశారు.