పాలకొల్లు క్షీరా రామ ఆక్వా రైతు సంఘం రైతులు ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపైన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లను కలసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఆక్వా రైతుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు. కార్యక్రమం లో మాజీ ఏఎంసి చైర్మన్ గొట్టుముక్కల గాంధీ రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.