ప్రేమ పేరిట యలమంచిలి మండలానికి చెందిన బాలికను వేధిస్తున్న వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మండలానికి చెందిన బాలిక గతంలో కోనసీమ జిల్లాలోని విశ్వేశ్వరాయపురంలో బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ కార్తీక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తరువాత తరచూ ఫోన్లో, వెంటబడి ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గురయ్య కేసు నమోదు చేశారు.