అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. గాంధీ బొమ్మల సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పట్టణ జనసేన అధ్యక్షుడు శిడగం సురేంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు వివరించారు.