తల్లివందనం పేరుతో రూ. 2వేలు కోత విధించడం అన్యాయమని పాలకొల్లు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాల రావు అన్నారు. శనివారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రూ.13వేలు ఇచ్చి మోసం చేసిందన్నారు. మిగిలిన రూ. 2వేలు ఎవరి జేబులోకి వెళ్లాయో నారా లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే తల్లుల ఖాతాలో రూ. 2 వేలు జమ చేయాలని కోరారు.