పాలకొల్లు: పని ఒత్తిడి తగ్గించాలని కార్యదర్శుల వినతి

50చూసినవారు
పాలకొల్లు: పని ఒత్తిడి తగ్గించాలని కార్యదర్శుల వినతి
పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని, సర్వేల పేరుతో తమకు పని ఒత్తిడి మరింత ఎక్కువ ఉందని పాలకొల్లు మండల పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పని భారం తగ్గించాలని, పని ఒత్తిడి పెంచవద్దని కోరుతూ గురువారం పాలకొల్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు లింగం సత్యనారాయణ, పాలా శ్రీను, శివరామకృష్ణ, గాయత్రి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్