పాలకొల్లు కెనాల్ రోడ్డు లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో, శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త గ్రంధి మురళీకృష్ణ ఒక ప్రకటలో తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించ వలసినదిగా కోరారు.