దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్.జె.సి) వేండ్ర త్రినాధరావును పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు శుక్రవారం తన సిబ్బందితో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి గాంధీ, పడాల అన్నవరం తదితరులు పాల్గొన్నారు.