మళ్లీ అధికారంలోకి వస్తే ఇంట్లో నుంచి లాగి బయట కొడతామని, నరికేస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పాలకొల్లు పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిఆర్ కుంభకోణంలో త్వరలోనే కారుమూరి జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.