అమరావతి రాజధాని, మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు గాను పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో మంగళవారం కూటమి మహిళలు నిరసన తెలిపారు. గాంధీ బొమ్మల సెంటర్లో ప్రధాన రహదారి వెంబడి మానవహారంగా నిలబడి 100 మీటర్ల నలుపు క్లాత్ ను, బ్లాక్ బెలూన్లను పట్టుకొని అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మహిళలకు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.