పాలకొల్లుకి చెందిన శ్రీదేవి కొడుకుతో కలిసి బైకుపై వాకింగ్ నిమిత్తం వెళ్తుండగా స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులోకి వెళ్లే సరికి వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో మహిళకు బలమైన గాయం కావడంతో స్థానికులు పాలకొల్లులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.