యలమంచిలి మండలం చించినాడ వద్ద శనివారం ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికులు భీమవరం పట్టణంలోని ఇంపీరియల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఇంపీరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలిసినవారు భీమవరంలోని ఇంపీరియర్ హాస్పిటల్‌ను సంప్రదించాలని స్థానికులు కోరారు.