భారతీయ కాపు సేవా సమితి పాలకొల్లు నియోజకవర్గ అధ్యక్షులుగా శ్రీనివాస్ పినిశెట్టిని జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ( కన్నా) నియమించడం జరిగినది. నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షులు కన్నా జాతీయ మహిళా కన్వీనర్ వన్నెం రెడ్డి భవాని చేతుల మీదుగా తీసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మన భారతీయ కాపు సేవా సమితినీ గ్రామస్థాయి నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో పటిష్టంగా నిర్మించాలని పినిశెట్టిని కన్నా కోరారు.