పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం 33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల నిమిత్తం ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు నరసాపురం ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని సగంచెరువు, గొల్లగూడెం, తిల్లపూడి గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.