పాలకొల్లు మండలం కాపవరం గ్రామంలో సోమవారం పాండ్ర మహాలక్ష్మి అనే మహిళకు చెందిన తాటాకిళ్లు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై కాలిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పరామర్శించారు. అనంతరం మహాలక్ష్మి కుటుంబానికి నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.