పాలకొల్లు టౌన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ సౌకర్యాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్ కమిటీ నిర్వాహకులు, సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడును ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టౌన్ హాల్ అభివృద్ధికి కృషి చేస్తున్న పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.