సార్వత్రిక ఎన్నికల బదిలీలలో భాగంగా పాలకొల్లు నుంచి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి బదిలీపై వెళ్లిన వెంకటేశ్వరరావు తిరిగి శుక్రవారం పాలకొల్లు ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికారు. పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.