చంద్రమండలం పైకైనా అడుగు పెట్టొచ్చు కానీ జగనన్న కాలనీలలోకి మాత్రం అడుగు పెట్టలేమని అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు టిడ్కో గృహాల ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాలకొల్లును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రి నారాయణకు నిమ్మల కృతజ్ఞతలు తెలిపారు