యలమంచిలి: చికిత్స పొందుతూ కార్పెంటర్ మృతి

282చూసినవారు
యలమంచిలి: చికిత్స పొందుతూ కార్పెంటర్ మృతి
యలమంచిలి మండలం శిరగాలపల్లికి చెందిన వెలివెల బ్రహ్మం(49) వడ్రంగి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 1న మేడపాడులో పెంకుటిల్లు మరమ్మతుల పనికి వెళ్లారు. పైకప్పు బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తలకు గాయమైంది. అతడిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దీనిపై కుమారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్