యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ చేతుల మీదుగా కూటమి నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తుందని అలాగే రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు.