బుట్టాయిగూడెం: చెట్టు ఢీ కొట్టిన ఆటో

54చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను ఎక్కించుకొని జంగారెడ్డిగూడెం నుండి దొరమామిడి వెళుతున్న ఆటో స్థానిక కరాటం రంగనాయకమ్మ కాలనీ వద్ద వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్