బుట్టాయగూడెం మండలం, బూసరాజుపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రజలు హాజరై రోడ్లు, మంచినీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.