ఇటీవల విజయవాడలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్టేట్ అసోసియేషన్ కి బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మనేంద్రరావు జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని శనివారం కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.