కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా పోలవరంలో కూటమి నాయకులు, కార్యకర్తలు గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుపరిపాలనకు ఏడాది పూర్తి అయిందని అన్నారు.