గవరవరంలో వంట వార్పు కార్యక్రమం

76చూసినవారు
గవరవరంలో వంట వార్పు కార్యక్రమం
కొయ్యలగూడెం మండలం గవరవరంలోని పాత పొగాకు గోడౌన్స్ వద్ద రైతులు, కౌలు రైతులు చేస్తున్న రిలే దీక్షలు నాలుగోవ రోజుకు చేరుకున్నాయి. తమను ఆదుకోవాలంటూ వంటావార్పు కార్యక్రమం నిర్వహించి అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మా పంట డబ్బులు మాకు ఇప్పించడం మహాప్రభో అంటూ నినాదాలు చేశారు. దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులకు ధాన్యం, మొక్కజొన్న సొమ్ములు ఇప్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్