బుట్టాయిగూడెం మండలంలోని కోయ రాజమండ్రి, అచ్చయ్యపాలెం, ఎన్ఆర్ పాలెం లక్ష్ముడుగూడెం గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి ముత్యాలరావు ఆదివారం పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. 55 ఎకరాల నారుమడులు నీట మునిగాయన్నారు. 115 ఎకరాల వరి, 15 ఎకరాల పత్తి, 10 ఎకరాల మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.